నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్ఈ)

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1963లో ఎన్‌టీఎస్ఈ (నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్) ప్రారంభించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌టీఎస్ఈ) పరీక్ష నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది.

 లక్ష్యం

 

 ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థికంగా చేయూతనిస్తూ అభివృద్ధిలోకి తీసుకురావడం. గత ఏడాది (2011) వరకు ఈ పరీక్షను ఎనిమిది, పది తరగతుల విద్యార్థులకు నిర్వహించే వారు. ఈ ఏడాది (2012) నుంచి కేవలం పదో తరగతి వారికి మాత్రమే నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి ఎన్‌సీఈఆర్‌టీ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తుంది.

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 1000

 (వీటిలో 15 శాతం స్కాలర్‌షిప్‌లను ఎస్సీ వారికి, 7.5 శాతం ఎస్టీలకు, మరో 3 శాతాన్ని శారీరక వికలాంగులకు కేటాయించారు). వీరికి నెలకు రూ.500 ఇస్తారు.

ఎప్పటిదాకా ఇస్తారు?

 విద్యార్థి వరుసగా విద్యార్జన కొనసాగిస్తుంటే డాక్టొరల్ స్థాయికి వచ్చే వరకు ఈ మొత్తాన్ని ఇస్తారు. అభ్యర్థి దరఖాస్తులో సూచించిన చిరునామాకు స్కాలర్‌షిప్‌ను పంపుతారు.

పరీక్ష నిర్వహించే భాషలు:

 తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, అస్సామీ, బెంగాల్, గుజరాత్, కన్నడ, మరాఠీ, మలయాళం, ఓరియా, పంజాబీ, తమిళం.

పరీక్ష సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతుంది?

 సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మొదట స్టేజ్ -1, తర్వాత స్టేజ్-2 ఉంటాయి.

ప్రకటనలు ఎప్పుడు వస్తాయి? పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?

 పరీక్షకు సంబంధించిన ప్రకటనలు సాధారణంగా జులై/ ఆగస్టు నెలల్లో వస్తాయి. స్టేజ్ -1 పరీక్ష నవంబరులో, స్టేజ్-2 పరీక్ష తదుపరి సంవత్సరం మేలో జరుగుతుంది.

పరీక్ష కేంద్రాలు:

 స్టేజ్-1 పరీక్షను రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.స్టేజ్-2 పరీక్ష కేంద్రాలను ఎన్‌సీఈఆర్‌టీ నిర్దేశిస్తుంది.

ఎవరు అర్హులు?

 రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లతోపాటు, కేంద్రీయ విద్యాలయాలు, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ (న్యూఢిల్లీ) అనుబంధ విద్యా సంస్థల్లో రెగ్యులర్‌గా పదో తరగతి చదువుతున్న వారు మాత్రమే దీనికి అర్హులు.

 ఎంపిక విధానం

 

ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది స్టేజ్ -1. ఇది రాష్ట్ర స్థాయి పరీక్ష. విద్యార్థులు తాము పదో తరగతి చదువుతున్న రాష్ట్రంలో నిర్దేశించిన కేంద్రంలో పరీక్షకు హాజరు కావచ్చు. ఈ దశలో అర్హత సాధించిన వారికి స్టేజ్ -2 (జాతీయ స్థాయి) పరీక్ష నిర్వహిస్తారు.
 స్టేజ్ -1 పరీక్ష విధానం (స్టేట్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్)
ఇది పూర్తి ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. దీన్లో రెండు భాగాలుంటాయి. అవి.

 ఎ) మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్)

 90 కంపల్సరీ ప్రశ్నలు - 90 మార్కులు - 90 నిమిషాలు

 బి) స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)

 90 కంపల్సరీ ప్రశ్నలు - 90 మార్కులు - 90 నిమిషాలు

 ప్రశ్నకు 1 మార్కు. స్టేజ్-1 పరీక్ష ఎవాల్యుయేషన్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం పర్యవేక్షిస్తుంది..

సిలబస్:
1) మెంటల్ ఎబిలిటీలో విద్యార్థుల రీజనింగ్ సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఇస్తారు.

 దీన్లో ఎనాలజీస్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ - డీ కోడింగ్, బ్లాక్ అసెంబ్లీ, ప్రాబ్లమ్ సాల్వి ంగ్ అంశాలపై ప్రశ్నల ఇస్తారు.

2) రెండో పేపర్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

  హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ, ఎకనమిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలను ఇస్తారు.

* ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి ఎలాంటి ప్రశ్నలను మొదటి స్టేజ్‌లో ఇవ్వరు.

ఫలితాల వెల్లడి:

 స్టేజ్-1 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడిస్తుంది. అర్హులైన వారికి తమ దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వివరాలను పంపుతారు.

స్టేజ్ -2 కు రాష్ట్రం నుంచి ఎంత మందిని పంపుతారు?

 ఏపీలో నిర్వహించే స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన 295 మంది విద్యార్థులకు స్టేజ్-2 (ఎన్‌టీఎస్ఈ) రాసే అవకాశం లభిస్తుంది. గత ఏడాది (2011) స్టేజ్-1 పరీక్షకు మొత్తం 38,000 మంది హాజరయ్యారు.

 స్టేజ్ -2: నేషనల్ లెవెల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (జాతీయ స్థాయి పరీక్ష).

 మొదటి దశలో అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కూడా రెండు భాగాలుంటాయి. అవి.

 1) మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్).

 2) స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్).

సిలబస్:

దీనికి ప్రధానంగా సీబీఎస్ఈ 9, 10, 11 తరగతుల విద్యార్థులకు ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన సోషల్ స్టడీస్ సైన్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టేజ్-2 ఫలితాలను ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటిస్తుంది.
తుది ఎంపిక:

 రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 దరఖాస్తు విధానం

 

విద్యార్థులు దరఖాస్తు ఫారాలను తమ జిల్లా విద్యా శాఖాధికారి (డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్) కార్యాలయం నుంచి పొందవచ్చు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌ల నుంచి కూడా దరఖాస్తులు పొందవచ్చు. అన్ని వివరాలతో దరఖాస్తును పూర్తిచేసి తాము పదో తరగతి చదువుతున్న స్కూల్ హెడ్ మాస్టర్/ ప్రిన్సిపల్‌తో సంతకం చేయించి తమ జిల్లా డిఈవో కార్యాలయానికి పంపాలి. వీటిని స్కూల్ హెడ్ మాస్టర్/ హెడ్ మిసెస్ నిర్ణీత గడువు తేదీలోగా పంపాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాల వివరాలను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధిత స్కూళ్లకు తెలియజేస్తారు. .

ఫీజు చెల్లించే విధానం:

స్టేజ్-1 పరీక్షకు అభ్యర్థులు Secretary to CGE, AP, Hyderabad పేరుతో ఎస్‌బీహెచ్/ ఎస్‌బీఐలో రూ.100లకు డీడీ తీసి ఆ వివరాలను దరఖాస్తులో రాయాలి. డీడీని దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది.

ఎన్‌టీఎస్ఈ - 2013 ముఖ్యమైన తేదీలు:
 స్టేజ్-1 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడిస్తుంది. అర్హులైన వారికి తమ దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు వివరాలను పంపుతారు.

స్టేజ్ -2 కు రాష్ట్రం నుంచి ఎంత మందిని పంపుతారు?

* స్టేజ్ - 1 (ఎస్‌టీఎస్ఈ)కు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 31.

* స్టేజ్ - 1 పరీక్ష తేదీ: నవంబరు 18.

* స్టేజ్ - 2 పరీక్ష తేదీ: మే 12 (2013).

వెబ్‌సైట్లు: 
 www.ncert.nic.in 
 www.bseap.org

 అప్లికేషన్ ఫారం

                                                                                                                                                                                         

Powered By: Mahesh