విదేశాల్లో మెడికల్ కోర్సులు
పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా వైద్యరంగానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. కానీ, విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే

మనరాష్ట్రంలో వైద్య విద్యా సంస్థల సంఖ్య చాలా తక్కువ. ఏటా సుమారు 80 నుంచి 95 వేల మంది విద్యార్థులు మెడికల్ కోర్సులకోసం ఎంసెట్‌కు హాజరవుతుంటారు. మన రాష్ట్రంలో అన్ని విభాగాలకు కలిపి సుమారుగా 4800 సీట్లే ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ లాంటి ప్రముఖ కాలేజీల్లో సీటు రావాలంటే ఎంసెట్ ర్యాంకు 1000 లోపు (జనరల్ కేటగిరీ) ఉండాల్సిందే. ఇక మేనేజ్‌మెంట్కోటా కింద రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఇంత మొత్తంలో డబ్బులు పెట్టినా, చాలా సంస్థల్లో నాణ్యమైనవిద్య లభించడం లేదు.

పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా వైద్యరంగానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. కానీ, విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే మనరాష్ట్రంలో వైద్య విద్యా సంస్థల సంఖ్య చాలా తక్కువ. ఏటా సుమారు 80 నుంచి 95 వేల మంది విద్యార్థులు మెడికల్ కోర్సుల కోసం ఎంసెట్‌కు హాజరవుతుంటారు. మన రాష్ట్రంలో అన్ని విభాగాలకు కలిపి సుమారుగా 4800 సీట్లే ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ లాంటి ప్రముఖ కాలేజీల్లో సీటు రావాలంటే ఎంసెట్ ర్యాంకు 1000 లోపు (జనరల్ కేటగిరీ) ఉండాల్సిందే. ఇక మేనేజ్‌మెంట్ కోటా కింద రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఇంత మొత్తంలో డబ్బులు పెట్టినా, చాలా సంస్థల్లో నాణ్యమైన విద్య లభించడం లేదు.
ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులు తాము కోరుకున్న కోర్సు చదవడానికి ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.
ఈ క్రమంలోనే విదేశీ విద్యకూ డిమాండ్ పెరుగుతోంది. మన రాష్ట్రం నుంచి ఏటా సుమారు 1500 నుంచి 2500 మంది
వైద్య విద్య కోసం విదేశాలకు వెళుతున్నారు. గత రెండేళ్ల నుంచే ఈ సంఖ్య పెరిగింది. కానీ, బైపీసీ విభాగంలో ఇంటర్ పూర్తి
చేసిన విద్యార్థులతో పోలిస్తే ఇది చాలా తక్కువే. దీనికి కారణం కొన్ని కన్సల్టెన్సీ సంస్థల మోసాలు; విద్యార్థులు, వారి
తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలే. ఈ నేపథ్యంలో విదేశీ వైద్య విద్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం..

విదేశాలకు వెళ్లి వైద్య విద్యనభ్యసించడమనేది చాలా ఏళ్ల నుంచే కొనసాగుతున్న ప్రక్రియ. భారత్ నుంచి ఎక్కువగా
ఉక్రెయిన్, కిర్గిస్థాన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్, మధ్య అమెరికా, బల్గేరియా, జార్జియా లాంటి దేశాలకు వైద్య విద్య కోసం
వెళుతున్నారు. వీటిలో అత్యల్ప జనాభా కలిగి ఉండి, ప్రాథమిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపే దేశాలతోపాటు జనాభా
ఎక్కువగా ఉన్నా, అభివృద్ధిపథంలో దూసుకుపోతూ, మౌలిక వసతుల కల్పనలో ముందు వరుసలో ఉన్న దేశాలూ
(రష్యా, చైనా) ఉన్నాయి. ఆయా దేశాలను బట్టి కోర్సు వ్యవధి నాలుగు నుంచి ఆరేళ్ల వరకు ఉంది. 2002లో భారత
వైద్య మండలి ఎఫ్.ఎం.జి.ఇ. (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్)ను ప్రవేశ పెట్టిన తర్వాత వైద్య విద్య కోసం
విదేశాలకు వెళ్లేవారి సంఖ్య కొంత తగ్గింది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే, విదేశాల్లో చేసిన వైద్య విద్యకు గుర్తింపు
లభిస్తుంది. కోర్సు ఫీజు తప్ప డొనేషన్ల లాంటి ఇతర ఫీజులు లేకపోవడం, ప్రత్యేకమైన ప్రవేశ పరీక్షలు
లేకుండా ఇక్కడి అర్హతలతోనే సీట్లు కేటాయిస్తుండటంతో మన విద్యార్థులు ఆ దేశాలకు వెళ్లి చదువుకోవడానికి
ఆసక్తి చూపుతున్నారు. విదేశీ విద్యకు సంబంధించి కూడా బ్యాంకులు రుణ సదుపాయాన్ని (ఎడ్యుకేషన్ లోన్స్)
కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ నుంచి అందులోనూ మనరాష్ట్రం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు
ఈవిధంగా వెళుతున్నారు. తర్వాత స్థానాల్లో తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ ఉన్నాయి.
విదేశాలకు వెళ్లేవారిలో అబ్బాయిలతోపాటు అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.
 

 ప్రధాన కోర్సులు - ఫీజుల వివరాలు

 ఎవరు అర్హులు?

 మొదటి అడుగు

 పాస్‌పోర్టు, వీసా పొందడం ఎలా?

 ఎంసీఐ - స్క్రీనింగ్ టెస్ట్

 నిపుణుల సలహాలు

 విద్యార్థుల అభిప్రాయాలు

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు                             

                                                 

Powered By: Mahesh