మార్పులు కొద్దిగా...మార్కులు 'నీట్‌'గా!


వైద్యకోర్సుల్లో ప్రవేశానికి 2013లో 'ఎంసెట్‌' బదులు 'నీట్‌' అనివార్యం కాబోతోందా? అదే జరిగితే విద్యార్థులు తమ ప్రిపరేషన్‌

తీరులో ఏమేం మార్పులు చేసుకోవాలి? ఎంసెట్‌, నీట్‌ల మధ్య ప్రధాన తేడాలేమిటి? ప్రవేశపరీక్ష ఏది నిర్వహించినా తడబడకుండా

మెరుగైన మార్కులు తెచ్చుకోవటం ఎలా?... ఇవిగో సూచనలు!దేశంలోని వైద్యకళాశాలల్లో స్నాతక, స్నాతకోత్తర ప్రవేశాలకు '

ఒకే ప్రవేశపరీక్షా విధానం' గురించి చర్చ 2010 నుంచిప్రారంభమైనా దాదాపుగా ఒక రూపు ఏర్పడింది ఈ ఏడాదే! 

 

వైద్యకోర్సుల్లో ప్రవేశానికి 2013లో 'ఎంసెట్‌' బదులు 'నీట్‌' అనివార్యం కాబోతోందా? అదే జరిగితే విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ తీరులో ఏమేం మార్పులు చేసుకోవాలి? ఎంసెట్‌, నీట్‌ల మధ్య ప్రధాన తేడాలేమిటి? ప్రవేశపరీక్ష ఏది నిర్వహించినా తడబడకుండా మెరుగైన మార్కులు తెచ్చుకోవటం ఎలా?... ఇవిగో సూచనలు!

దేశంలోని వైద్యకళాశాలల్లో స్నాతక, స్నాతకోత్తర ప్రవేశాలకు 'ఒకే ప్రవేశపరీక్షా విధానం' గురించి చర్చ 2010 నుంచి ప్రారంభమైనా దాదాపుగా ఒక రూపు ఏర్పడింది ఈ ఏడాదే!

 
2013లో దేశవ్యాప్తంగా వైద్య, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశం National Eligibility cum Entrance Test- NEET)ద్వారా జరపటానికి
రంగం సిద్ధమైంది. దీనిలో AIIMS, JIPMERమాత్రమే పాల్గొనటం లేదు. అంటే ఈ రెండు కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ
గత సంవత్సరాల మాదిరే జరుగుతుంది. మిగిలిన అన్ని వైద్యకళాశాలల్లో ప్రవేశాలు 'నీట్‌' ఆధారంగానే! ఈ నేపథ్యంలో ఒకవేళ
నీట్‌ జరిగినట్లయితే ఈ పరీక్షకూ, ఎంసెట్‌కూ ముఖ్యతేడాలను విద్యార్థులు గమనించాలి. అప్పుడే వారి సంసిద్ధత మెరుగ్గా అవుతుంది.
ఎంసెట్‌లో నాలుగు విభాగాలు :
ఎంసెట్‌ మెడికల్‌లో నాలుగు విభాగాలున్నాయి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ. వీటిలో ప్రతి సబ్జెక్టులో 40 ప్రశ్నలు
అంటే మొత్తం 160 ప్రశ్నలతో 160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్టు కటాఫ్‌ మార్కులు లేవు. రుణాత్మక మార్కులు
లేవు. విద్యార్థులు బోటనీ, జువాలజీ కలిపి గంటలోపు, కెమిస్ట్రీ 45 నిమిషాల్లోపు, ఫిజిక్స్‌ గంట నుంచి 75 నిమిషాల్లోపు
పూర్తిచేసుకునే అలవాటు ఏర్పరచుకున్నారు. బయాలజీలో 75పైన, కెమిస్ట్రీలో 35పైన సాధిస్తే కచ్చితంగా సీటు సాధించినట్లే.
ఫిజిక్స్‌లో మార్కులు విద్యార్థి ఏ కేటగిరిలో ప్రవేశం పొందగలడో తేల్చడానికి ఉపయోగపడతాయి. ఫిజిక్స్‌లో మంచి
మార్కులు సాధించగలిగితే ప్రభుత్వ కళాశాలలో లేదా ప్రైవేటు కేటగిరి ఎ లేదా బి అనేది ఆ విద్యార్థి భౌతికశాస్త్రంలో తెచ్చుకునే
మార్కులను బట్టి తేలుతుంది. కానీ కళాశాలల్లో ప్రవేశానికి బయాలజీ, కెమిస్ట్రీ సరిపోతోంది.రాబోయే నీట్‌లో ఇలా తప్పించుకోడానికి
గానీ, రెండు సబ్జెక్టులు చదివి ఒకటి వదిలివేయటానికి గానీ ఎలాంటి అవకాశమూ లేదుఈ మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
నీట్‌లో మూడే విభాగాలు:
ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి జరిగే 'నీట్‌' మే 5న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 3 గంటల వ్యవధిలో
జరుగుతుంది. మొత్తం 180 ప్రశ్నలు. పరీక్ష నాలుగు విభాగాలుగా కాకుండా కేవలం విమూడు విభాగాలుగానే ఉంటుంది. అంటే
బయాలజీ (బోటనీ+ జువాలజీ), ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు. ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలుంటాయనేది ప్రకటించాల్సివుంది.
ఎంసెట్‌లో బయాలజీని తక్కువ వ్యవధిలో పూర్తిచేసి మిగతా కాలాన్ని ఫిజిక్సుకు ఉపయోగించుకునేవారు. ఇప్పుడు బయాలజీ
ప్రాధాన్యం 50 శాతం నుంచి 33 శాతానికి తగ్గింది కాబట్టి ఇప్పుడు బయాలజీ రాయగా మిగిలిన వ్యవధి కెమిస్ట్రీకి సరిపోతుంది.
కానీ ఫిజిక్స్‌ 25 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది. దానికి కావాల్సిన సమయం విద్యార్థికి దొరకదు. అంటే ఎంసెట్‌తో పోలిస్తే
జవాబులు గుర్తించడంలో వేగం పెరగాలి.ఎంసెట్‌లో ఎలాంటి రుణాత్మక మార్కులూ లేనందున జవాబులు తెలిసినా తెలియకపోయినా
గుర్తించే అలవాటును విద్యార్థులు చేసుకుంటున్నారు. నీట్‌లో రుణాత్మక మార్కులున్నాయ్‌. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులూ;
తప్పు సమాధానానికి-1మార్కు. అంటే తెలియని ప్రశ్నలకు జవాబు గుర్తించడం ప్రారంభిస్తే వచ్చిన మార్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది
. దీన్ని అధిగమించాలంటే... సమాధానాల్లో కచ్చితత్వం పెంచుకోవాలి.ప్రశ్నల సంఖ్య పెరిగినందువల్ల వేగం, రుణాత్మక మార్కులున్నందున
కచ్చితత్వం పెరగాలి. పునశ్చరణ ఎక్కువసార్లు చేయటంవల్లనే ఇది సాధ్యమవుతుంది. ప్రశ్నల సంఖ్య పెరుగుతున్నది కాబట్టి ప్రశ్నల
క్లిష్టత సహజంగా తగ్గుతుంది. దీన్ని మనసులో ఉంచుకుని విద్యార్థులు సంసిద్ధమవ్వాలి.
ప్రతి సబ్జెక్టులో కటాఫ్‌:
నీట్‌- నూతన విధానంలో మూడు సబ్జెక్టులూ సమాన ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఎందుకంటే ప్రతి సబ్జెక్టులోనూ కటాఫ్‌ మార్కులు
నిర్వచించారు. గతంలో కటాఫ్‌ లేదు కాబట్టి ఒక సబ్జెక్టులో సున్నా మార్కులు వచ్చినా కూడా సీటు సాధించేవారు. కానీ ఇప్పుడు ప్రతి
సబ్జెక్టులో కటాఫ్‌ మార్కు వస్తేనే ర్యాంకు పొందటానికి అర్హత సాధించినట్లవుతుంది.
కటాఫ్‌... పర్సంటైల్‌:
నీట్‌లో మూడు సబ్జెక్టులకూ కటాఫ్‌ మార్కు ఉందని తెలుసుకున్నాం కదా? జనరల్‌ కేటగిరి విద్యార్థులకు 50వ పర్సంటైల్‌, ఎస్‌సీ,
ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు 40వ పర్సంటైల్‌, వికలాంగ విద్యార్థులకు 45వ పర్సంటైల్‌ను కటాఫ్‌గా నిర్దేశించారు.
పర్సంటైల్‌కీ, పర్సంటేజికీ మధ్య తేడా ఉంది. దీన్ని విద్యార్థులు గమనించాలి.
పర్సంటైల్‌ అనేది విద్యార్థి తెచ్చుకునే మార్కుల కంటే పోటీలో విద్యార్థి ఉన్న స్థానాన్ని నిర్ణయించేది.
ఉదా: ఒక విద్యార్థికి 80వ పర్సంటైల్‌ వచ్చిందంటే దాని అర్థం- ఆ విద్యార్థికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవారు 20శాతం
మంది ఉన్నారనీ, తక్కువ మార్కులు సాధించినవారు 80శాతం ఉన్నారనీ అర్థం.
ఇక్కడ కటాఫ్‌ 50వ పర్సంటైల్‌ అంటే పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల మార్కులను ఆరోహణ క్రమంలో తీసుకుంటే మధ్య విద్యార్థి
తెచ్చుకున్న మార్కులని చెప్పాలి. అంటే 10లక్షలమంది పరీక్ష రాశారనుకుంటే మార్కుల ఆరోహణక్రమంలో 5వ లక్ష విద్యార్థిది కటాఫ్‌
మార్కు అవుతుంది. ఈ మార్కు... పరీక్ష పేపరు క్లిష్టతపై ఆధార పడుతుంది.
కటాఫ్‌ మార్కులు బయాలజీలో 40 నుంచి 45 శాతం వరకూ, ఫిజిక్స్‌ కెమిస్ట్రీల్లో 25 నుంచి 30 శాతం వరకూ ఉండే అవకాశాలున్నాయి.
ఇంతకుముందు ఒక సబ్జెక్టు పూర్తిగా వదిలేసినప్పటికీ సీటు సాధించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కచ్చితంగా మూడు
సబ్జెక్టులకూ సమ ప్రాధాన్యం ఇచ్చి మూడింటిలో కటాఫ్‌ మార్కులు సాధించినపుడే ర్యాంకు పొందే అవకాశం ఉంటుంది.
ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజి ఇచ్చి తుది ర్యాంకు లెక్కిస్తున్నారు. కానీ 2013లో జరగబోయే నీట్‌లో
ఇంటర్‌ వెయిటేజి లేదు. కేవలం నీట్‌లో తెచ్చుకున్న మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు.
మన రాష్ట్ర విద్యార్థులకు సీట్ల కేటాయింపు పద్ధతి:
ఆంధ్రప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌ విద్యార్థులు జాతీయపూల్‌లో లేరు కాబట్టి మొత్తం 100 శాతం సీట్లు ఈ రాష్ట్రాల్లోని విద్యార్థులతోనే
నింపుతారు. అంటే మనరాష్ట్ర విద్యార్థులు ఈ పరీక్ష రాయటం వల్ల సీట్లు అదనంగా పొందటం/ కోల్పోవటం ఏమీ జరగదు. అయితే ఈ
నూతన పద్ధతిలో కేటగిరీ-సి సీట్లు నీట్‌లోని ర్యాంకు ఆధారంగా స్టేట్‌ రిజర్వేషన్‌ లేకుండా నింపుతారు. అంటే మన రాష్ట్ర విద్యార్థు
లు డొనేషన్‌ లేకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వైద్యకళాశాలల్లో కూడా కేటగిరి-సి సీట్లలో చేరే అవకాశం లభించినట్లయింది.
AFMC, Puneలోని ఎంబీబీఎస్‌ సీట్లు కూడా నీట్‌ ఆలిండియా ర్యాంకు ఆధారంగానే నింపుతారు.
పరీక్షా కేంద్రాలు:
సీబీఎస్‌ఈ ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నీట్‌కు నాలుగు పరీక్షాకేంద్రాలు మాత్రమే ఇచ్చారు. అవి హైదరాబాద్‌,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. ఈ నీట్‌ ప్రతి రాష్ట్రంలోని డైరక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఇంకా నోడల్‌ లేదా సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. మనరాష్ట్రంలో రెండు సహాయక కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
1) భారతీయ విద్యాభవన్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌
2) వి.పి. సిద్ధార్థ పబ్లిక్‌స్కూల్‌, మొగల్రాజపురం, విజయవాడ
దరఖాస్తులు జారీ చేయడం డిసెంబరు 1 నుంచి మొదలవుతుంది. డిసెంబరు ఆఖరు వరకూ ఎలాంటి అపరాధ రుసుము
లేకుండా దరఖాస్తులను పంపించవచ్చు. మే 5న పరీక్ష జరిగితే ఫలితాలు జూన్‌ రెండోవారంలో వెలువరిస్తారు. దాని ఆధారంగా
కౌన్సెలింగ్‌ తేదీలు కూడా నిర్థారణ చేసి ఇచ్చారు. వీటిలో కొన్ని వివరాలు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌ AIPMT లో ఉన్నాయి.
annexure 6, 7 లలో పూర్తి వివరాలు దొరుకుతున్నాయి..

మెరుగైన సంసిద్ధత ఎలా?
1. ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ఎటువంటి తేడా లేదు కాబట్టి వీటి కోసం మన అకాడమీ పుస్తకాలకు పరిమితమై చదివితే సరిపోతుంది.

కెమిస్ట్రీకి మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలను కచ్చితంగా చదవాలి.
2. ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ప్రశ్నల సంఖ్య పెరిగి; క్లిష్టత తగ్గుతోంది. అందువల్ల అడ్వాన్స్‌ లెవల్‌ ప్రాబ్లమ్స్‌ చేస్తూ సమయాన్ని నష్టపోకూడదు.

లెవల్‌-1, 2 వరకూ ప్రాబ్లమ్స్‌ చేయగలిగితే సరిపోతుంది.
3. బయాలజీ సిలబస్‌లో చాలా మార్పు ఉంది. ఇప్పటినుంచీ ఈ అదనపు సిలబస్‌పై అభ్యాసం చేయాలి.
4. బయాలజీలో శిక్షణ పొందటం కూడా అవసరమవుతుంది. దీంతోపాటు కొత్త సిలబస్‌లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను అసైన్‌మెంట్ల

రూపంలో శిక్షణ పొందాలి.
5. రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి తెలియని ప్రశ్నలకు జవాబులు గుర్తించకుండా ఉండేవిధంగా అలవాటు చేసుకోవటానికి

ఇప్పటినుంచే అభ్యాసం చేయాలి. 
6. ప్రశ్నల సంఖ్య పెరిగిన దృష్ట్యా వేగం, కచ్చితత్వం పెంచుకునేందుకు ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకోవాలి.

 

7. ఎంసెట్‌- ఫిజిక్స్‌లో 40 ప్రశ్నల్లో 36వరకూ లెక్కలుంటాయి. కానీ నీట్‌లో అధికశాతం సిద్ధాంతపరమైన ప్రశ్నలుండవచ్చు.

మన అకాడమీ పుస్తకాల్లోని assess yourself కింద ఉన్న అన్ని ప్రశ్నలనూ అభ్యాసం చేస్తే బాగా ప్రయోజనం.
8. ప్రశ్నల సంఖ్య పెరిగినందున ప్రతి సబ్జెక్టుకూ నిర్ణీతకాల వ్యవధి కేటాయించి నమూనా పరీక్షలు ఎక్కువగా రాయాలి.
9. మనరాష్ట్ర విద్యార్థులకు 'నీట్‌' జరగటానికే అవకాశాలున్నాయి. ఒకవేళ పరీక్ష నీట్‌ బదులు 'ఎంసెట్‌' అయినా ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో

తయారయే విధానం దాదాపు ఒకటిగానే ఉంటుంది. బయాలజీ అదనంగా చదవటం వల్ల AIIMS,జిప్మర్‌ లాంటి పరీక్షలు కూడా

బాగా రాసే అవకాశం ఏర్పడుతుంది.
ఏ పరీక్ష అయినా సబ్జెక్టులపై సమగ్ర అవగాహన పెంచుకునేలా చదవటం ప్రధానం. అది పకడ్బందీగా ఉంటే ఏ పరీక్షా విధాన్నయినా

ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు

   రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లోనే 'నీట్‌'

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల కోసం జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)ను 2013 మే 12న

నిర్వహించనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ నిర్ణయించింది. మన రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఇంగ్లీషు, హిందీతోపాటు తెలుగు

భాషలోనూ నీట్‌ ప్రశ్నపత్రం రూపొందించనున్నారు. మన రాష్ట్రంలో నాలుగు కేంద్రాల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాలను 'నీట్‌' పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు.

 

 

The Medical Council of India and Dental Council of India have notified that the Central Board of Secondary Education shall be the organization to conduct the National Eligibility cum Entrance Test (NEET) for admission to MBBS and BDS Courses for the Academic Year 2013 – 2014.

Admission to MBBS and BDS Courses in the institutions approved by the Medical Council of India and Dental Council of India are subject to merit position of candidates in the National Eligibility Cum Entrance Test (Under-Graduate), 2013
The syllabus for this examination as notified by the Medical Council of India is available on websitewww.mciindia.org

National Eligibility cum Entrance Test (NEET) is on: 05/05/2013

https://www.cbse.nic.in/Press%20Release_aipmt_doc_2012.pdf

NEET-UG(Biology).pdf (60,8 kB)
NEET-UG(Chemistry).pdf (70,7 kB)
NEET-UG(Physics).pdf (66,8 kB)
 

                                         

Powered By: Mahesh